19, నవంబర్ 2017, ఆదివారం

మారడానికి సమయం వచ్చింది.

ఒక వ్యక్తి సమూహంగా ఉన్నా ఒంటరిగా ఉన్న అతనికే సొంతమైన ఒ వ్యక్తిత్వం ఉంటుంది అలాగే సమూహానికి కూడా, కానీ ఘడియ ఘడియకి
వ్యక్తి వ్యక్తిత్వం మారితే అల్పుడంటారు, కానీ పరిస్థితిని బట్టి సమూహ లక్య్ఘాలు మారుతూ ఉండాలి అప్పుడే నిత్య చైతన్యంతో 
నిండిన ఆ సమాజం సమ సమాజంగా ఫరిఢవిల్లుతుంది, కానీ ఇది తిరగబడింది, ఆత్యాదునికమైన సాంకేతిక యుగంలో జీవిస్తూ 
క్షణానికో ఆవిష్కరణ ప్రపంచాన్ని ఊపేస్తున్న ఈ దశలో నా దేశానికేమైంది అనే ప్రశ్న వేలగొంతుకలతో నిలదీస్తుంది. ఎప్పుడో గతంలో 
సామాజిక హోదాని ఆర్థిక స్వావలంభనని బూచిగా చూపి ఓటు బ్యాంకు రాజకీయాలతో పార్వర్డ్ క్యాస్ట్ అనే పేరుని తగిలించి ఓ గుంపుని 
సమూహానికి అంటరానిదిగా బావించి వెలివేయడం ఎంత వరకు సభబు. 
ఆనాడు భారత రాజ్యాంగకర్త, భారత రత్న అంబేద్కర్ నాటి సమాజంలో ఉన్న అసమానతల్ని సరిచేయడానికి సామాజికంగా
మార్పు తేవడానికి యావత్ జాతిని ఒకే గొడుగు కిందకు తేవడానికి ఎంతో ముందుచూపుతో దార్శనికతతో 10 సంవత్సరాల పరిమితితో
ఏర్పాటు చేసిన రిజర్వేషన్లని, పూటకో మాటతో పబ్బం గడుపుకునే రాజకీయ నేతలు! నాటి సమాజ స్థితిగతులకి నేటి పరిస్థితులకి 
విపరీతమైన మార్పులు వచ్చిన తర్వాత కూడా కొనసాగించడం ఎంతవరకు సహేతుకం? నాడు ఆర్థిక వ్యవస్థ సామాజిక హోదాపై ఆదారపడ్డది
కానీ నేటి సామాజిక హోదా ఆర్థిక స్థిరత్వం నుంచి పుట్టుకొస్తుంది అనే కఠిన సత్యాన్ని సైతం గుర్తించకుండా కేవలం సామాజిక పరంగా 
అగ్రకులంలో జన్మించిన వ్యక్తిని పన్నుల పేరిట దోచి, ఆ దోచిన దాంట్లో అతని సమాజానికి కనీస భాగస్వామ్యం లేకుండా చేయడం
ఏ సమసమాజ న్యాయం?
పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడగూడదన్న మన న్యాయ ఏలిక అంతరార్థాన్ని
కూడా నేటి రాజకీయ పటాటోపులు అర్థం చేసుకోకపోవడం భాదాకరం అవును నిమ్మకులాలు అని మీరు చెప్పే వాల్లళ్లో 50శాతం ఇంకా అలాగే
(మీనివేదికల ప్రకారం మాత్రమే) ఉండొచ్చు, కానీ 70శాతం మా ప్రజలు సరైన తిండిలేక పిల్లల కనీస ప్రాథమిక అవసరాల్ని తీర్చలేని
నిస్సహాయస్థితిలో కాలం వెల్లదీస్తున్నారు ఇది సమంజసమేనా? దీనికి మీ సమాదానమేంటీ, అందరికీ విద్య అంటూ అదరగొట్టే మీ ప్రచార పటాటోపం
కనీసం ఆ విద్యాలయాల్లో యూనిఫామ్ ని ఎందుకు దరింపజేస్తున్నారో తెలుసుకొనే ప్రయత్నమైనా చేస్తున్నారా? బాల్యం నుండే పిల్లల్లో ఏ రకమైన 
తేడాలు లేకుండా పెరగాలని సర్వ సౌబ్రాత్రుత్వం అలవర్చుకోవాలని మనం అవలంబిస్తున్న యూనిఫామ్ విదానం ఐదో, ఆరో తరగతుల వరకి పిల్లాడికి
అర్థం కాకపోవచ్చు కానీ ఆపై చదువులకెల్తున్న ఒక రెడ్డి ఎందుకు నాకు ఉచిత పుస్తకాలివ్వట్లేదో తెలుసుకోలేడా? ఆపై చదువులకెల్తున్న ఒక రాజు
ఎందుకు నాకు స్కాలర్ షిప్పు రావట్లేదు అనే మీమాంస కలుగదా? అప్పుడు ఆ పసివాల్ల మనుషుల్లో మనం నాటుతున్నదేంటీ? దాని పర్యవసానం అతడిని
ఎంత క్షోబకి గురిచేస్తుంది (6వ తరగతి నుండి పై చదువులకెల్లే పిల్లాడికి ఇంతటి విచక్షణ రాలేకపోతే ఇంకా ఆ చదువుకి అర్థమేముంది).
కుల సర్టిఫికేట్లని ప్రభుత్వమే జారీచేస్తూ నువ్వు మాలవాడివి, మాదిగవాడివి, అని పదే పదే గుర్తుచేస్తున్న మీకన్నా వ్యక్తిగత కక్షలకీ కార్పణ్యాలకీ
అట్రాసిటీ కేసులతో నలుగుతున్న వారి దోషమేపాటిది? గ్లోబలైజేషన్, మాడ్రనైజేషన్, మెటీరియలైజేషన్ కాదు కావాల్సింది, అవసరాన్ని బట్టి సమూహ లక్ష్యాలని మార్చుకుంటూ
సమసమాజ స్థాపన ఏర్పాటు చేసే సివిలైజేషన్ కావాలి. అందుకే వ్యక్తిగా ద్రుడచిత్తం ఉన్న రాజీలేని రాజకీయ నాయకత్వం కావాలి. ఇతరుల అవసరాలతో పాటూ నా
అవసరాలనీ తీర్చే న్యాయమైన ప్రభుత్వం కావాలి. కుల మతాలని చెరిపేసే రిజర్వేషన్లు కావాలి, ఆర్థిక సామాజిక వెనకబాటు తనాన్ని పారద్రోలే రిజర్వేషన్లు కావాలి,
అందులో నాకూ బాగస్వామ్యం కావాలి. జైహింద్

HAPPY NEW YEAR 2017

ప్రయాణం ప్రవాహం.. 
సాగడమే కానీ ఆగడం తెలయని సజీవ లక్షణం
ఒక్కోసారి అనంతంగా ముంచేసే అల రావొచ్చు
మరోసారి అజేయంగా నిలబెట్టే కల తీరొచ్చు
కానీ 
గమనానికి గరిమనాభిలా
నీ గమ్యానికి నైతికసూచికని వదలొద్దు
ఇవ్వాళ ఉన్నది రేపుంటుందా?
రేపన్నది నీది కాకపోతుందా.
ఎదురయ్యే మలుపేదైనా వెరుపుచూపక వెలగడమే నీ ఇజం
రోజు వెనుక రోజు, చేదు వెనక తీపి
ఇదే కాలం మన దారిలో చేసే కొత్త సంతకం.
HAPPY NEW YEAR 2017.

మరో సూర్యుడు ఉదయించకపోడు......

ఓక ఉదయం సూర్యుడు ఉదయించాడు
లేదు, రాదు అన్న కర్కశ హ్రుదయాలని
ఎలా, ఎందుకు అన్న పాశన దోశుల్ని
వీళ్లు వాళ్లు అని తేడాలేదు జై తెలంగాణా అనని
ప్రతీ నిశీదిని పటాపంచలు చేస్తూ
ఓక ఉదయం సూర్యుడు ఉదయించాడు..
కానీ.....
కోకిల కూత ఆగిపోయింది
రైతన్న రాళ్లలో కలిసిపోతున్నాడని
నినాదం నీరసించిపోయింది
నిన్నటి కూలీ నేటి వలసపక్షయ్యాడని
అవకాశం ఆవిరైపోయింది
ఉద్యోగం కోసం ఈ ప్రయత్నాలేంటని
అవును ఉదయించింది
తెలంగాణా బిడ్డ రాజ్యమేలడానికే...
కాకపోతే ఒకింటి బిడ్డే.
ఇదే శాశ్వతం అని మీరనగలరా.....
మరో ఉదయం సూర్యుడు ఉదయించకపోడు......

శివా.... జాగ్రత్త

కిటికీకావల ప్రపంచం పెద్దది
నిండిన కడుపుని నిమురుతూ..
కిటికీకావల ప్రపంచం ఇరుకుది
ఆకల్ని చంపే మార్గం వెతుకుతూ....
శివా....
గత జన్మ శాపమా
కుంచించుకు పోయిన మనసుల రూపమా
శివా.... జాగ్రత్త
వెలుగు చూపే దారి మారకుంటే
వెల్పుల్ని కొలిచే రీతి మారుతుంది

సుక్మా కాష్టం

ఎవరు రగిల్చిన కాష్టమిది
సుక్మా ఐనా బీజాపూర్ ఐనా
కరుకు రెక్కల కురుక్షేత్రపు శకుని పావులే కదా
ఎవ్వడు వీరుడుడెవడు పరాజితుడు
అమ్మ ఆక్రందనకీ సమాదానమివ్వడెవడు
సోదరా దేశభక్తికి లెక్కమారింది
వాని కుత్సిత బుద్ధికి సమాదానమేది

నైరుతానికీ స్వాగతం

పలకరించింది తొలకరి
ప్రాణమే పురివిప్పి మెరవగా
ఇలకు జారింది చినుకు తడీ
స్వేద సేద్యానికి జతపడి నడవగా
వేడి నిట్టూర్పుల సెగలని తరమగ
ఉరకలేస్తుంది దరిత్రి కురులుగా
కన్నీళ్ళనే బాష్పాలుగా మార్చీ
ఆనందాన్నిస్తుంది ఈ వానా
అందమైన ఆ నైరుతానికీ
మృగరాజ స్వాగతం ఈ మృగశిరతో

సినారే

గురువా!
నీ రాకతో ధాత్రి నవ చైతన్యగాత్రి.
ఆప్తుడా!
నీ రేఖతో ప్రకృతి రూపెత్తిన ద్యుతి.
ఎక్కడికెళ్ళావు గురువా
వినువీది విశ్వంభరలో వెలుగులు నింపడానికా.
ఒక్క నోటిని నొక్కేయాలని చూస్తే
లక్ష్మకంఠాలై మోగుతుంది
అని సింహనాదం చేసి
నిదుర పోయిన మా చైతన్యాన్ని ఉరకలెత్తించి
ఎక్కడికెళ్ళావు గురువా
ఏ దిగంతాలలో సాహిత్యగోష్టిని నిర్వహించడానికా
తిరిగొస్తావా గురువా
ఈ విశ్వంభరని వెలిగించడానికి...
మా కండ్లు ధారలుగా వర్షిస్తున్నాయి
హనుమాజీపేట ఝంఝాతమై గర్జిస్తొంది
రా గురువా
ఈ సుధీరుని మనసు అరల్లోకి
రాగరంజితమై
మేఘాన్ని చీల్చుకొని.